ఆదివాసీ కొలం తోటి గిరిజనుల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి 24 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించడం జరిగిందని ఎంపీ గోడం నగేష్ అన్నారు.ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రధాన మంత్రి జన్మన్ యోజన, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఆయనతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, లైబ్రరీ చైర్మన్ నర్సయ్య పాల్గొన్నారు. ఈ మేరకు 359 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను అందజేశారు. లబ్ధిదారులకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే డ్వాక్రా సంఘాల ద్వారా లోన్ సదుపాయం కలిపించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు