మైదుకూరు మండల పరిధిలోని వనిపెంటలో సోమవారం పెన్షన్ల పంపిణీ డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక పెన్షన్లలో భాగంగా 1వ తారీకే పెన్షన్ లబ్ధిదారులందరికీ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నోటీసులు మంజూరైన వికలాంగులకు కూడా సెప్టెంబర్ నెలలకు సంబంధించి పెన్షన్ పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం వనిపెంట ఇత్తడి పరిశ్రమను ఆమె పరిశీలించారు.