బహుజనుల అభివృద్ధి కోసం కృషి చేసిన బీపీ మండల్ ఆశయాలను సాధిద్దామని బీసీ ఉద్యమ పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు. బీపీ మండల్ జయంతిని పురస్కరించుకొని సోమవారం జన్నారం మండల కేంద్రంలో బీసీ ఉద్యమ పోరాట సమితి నాయకులు బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీపీ మండల్ బహుజనుల పక్షపాతని పేర్కొన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యమ పోరాట సమితి జిల్లా,మండల నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ గౌడ్, అశోక్, నరసయ్య, శంకర్, పురుషోత్తం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.