రామాయంపేట మండలం కేంద్రంలో బిజెపి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ప్రధాని మోడీ తల్లి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. మెదక్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతు నరేంద్ర మోడీ తల్లిని దూషించిన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి అని రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను రామాయంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద దగ్ధం చేయడం జరిగిందన్నారు.