ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కృషితో నలుగురికి రాష్ట్రస్థాయి పదవులు దక్కాయి. దర్శి మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావుకు, తాలూరు మండల మాజీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డిని నాటక అకాడమీ డైరెక్టర్లుగా నియమించారు. బిజెపి దర్శి నియోజకవర్గ కన్వీనర్ మాడపాటి శ్రీనివాసులు కురిచేడు పార్టీ అధ్యక్షులు నెమలియ్యకు ఏపీ శాలివాహన కుమ్మరి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమిస్తూ రాష్ట్ర అధిష్టానం ప్రకటించినట్లుగా పదవులు పొందిన వారు తెలిపారు. పదవులు రావడానికి కారణమైన టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు.