అధ్వానంగా మారిన అప్పనపల్లి ఆర్అండ్ బీ రోడ్డు గోదావరి వరద ఉద్ధృతికి మరింతగా కొట్టుకుపోయింది. అప్పనపల్లి కాజ్వేతో పాటు రోడ్డు పాడైపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై ఏర్పడిన గోతుల్లో నీరు నిలిచిపోయి ప్రయాణికులను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది.