మహిళలు, బాలికల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘శక్తి యాప్’ పై శనివారం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు శక్తి టీమ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.మహిళల రక్షణలో శక్తి యాప్ అస్త్రంలా పనిచేస్తుందని, ఆపద సమయంలో తక్షణ సహాయం అందించగలదని టీమ్ సభ్యులు వివరించారు. ఎస్.ఓ.ఎస్ బటన్ లేదా డయల్ 112 ద్వారా సమాచారం అందిస్తే, 10 నిమిషాల్లోనే పోలీసులు మహిళల చెంత చేరుకుని రక్షణ చర్యలు చేపడతారని హామీ ఇచ్చారు.ప్రతి మహిళ, బాలిక, విద్యార్థిని ప్లే స్టోర్ ద్వారా శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకుని వ్యక్తిగత వ