Parvathipuram, Parvathipuram Manyam | Aug 31, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలోని గొల్లవీధిలో 60వేల కుందన్లతో ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమ చూపరులను ఆకట్టుకుంటుంది. గణపతి నవరాత్ర ఉత్సవాన్ని పురస్కరించుకుని గొల్లవీధి యువజనులు, పెద్దల సహకారంతో వినూత్న రీతిలో ప్రతిఏటా ప్రత్యేకంగా వినాయక ప్రతిమను సిద్ధం చేసి, విశేషంగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 60వ గణపతి నవరాత్రుల ఉత్సవం కావడంతో 60 వేల కుందన్లతో ధగధగా మెరిసిపోయేలా 60వేల కుందన్లతో గణపతిని సిద్ధం చేశారు. ఈ ప్రతిమను వీక్షించేందుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలనుండి కూడా భక్తులు తరలి వస్తున్నారు.