బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీంలో భాగంగా ఎస్పీ కార్పొరేషన్ ద్వారా పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించామన, ఇప్పుడు బిల్లులు రాలేదని యాజమన్యాలు పిల్లలను ఇంటికి పంపుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.