పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి శాసనసభ్యులు మామిడి గోవిందరావు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ – “ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించడమే అన్నా క్యాంటీన్ లక్ష్యం.ఈ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి,త్వరలోనే ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తాము. ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అండగా ఉండే విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.ఆ శ్రేణిలో అన్నా క్యాంటీన్ మరొక మైలురాయి అవుతుంది” అని అన్నారు