Parvathipuram, Parvathipuram Manyam | Aug 24, 2025
మా భూముల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడాన్ని మానుకోవాలని గిరిజనులు నిరసన తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని శతాబి పంచాయతీ పరిధిలో హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఏర్పాటుచేసిన సర్వే రాళ్ల వద్ద గిరిజనులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు గిరిజనుల భూములను స్వాధీనం చేసుకోవడం సరికాదన్నారు. గిరిజనుల పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు.