జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో పంట తక్కువగా సాగు చేస్తున్నందున యూరియా అవసరం తక్కువగా ఉంటుందని ప్రైవేటు డీలర్ల వద్ద మరియు రైతు సేవ కేంద్రాలలో రైతులందరికీ అవసరమయ్యే యూరియా కంటే ఎక్కువగా అందుబాటులో ఉందన్నారు. కొంతమంది రైతులను రెచ్చగొట్టడం కృత్రిమంగా యూరియా కొరత సృష్టించడం వంటి పనులు చేస్తున్నారని ఈ పనులు చట్టరీత్యా నేరమని అటువంటి పనులు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది సోషల్ మీడియాలలో తప్పుడు కథనాలు రాస్తున్నారని దానివల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారని, సోషల్ మీడియాలలో తప్పుడు కథనాలు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.