కాకినాడ జిల్లా తుని మండలం టి.తిమ్మాపురం గ్రామంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన డ్రోన్ ను ఎమ్మెల్యే యనమల దివ్య సోమవారం సాయంత్రం ప్రారంభించారు. రైతులకు మేలుచేసే విధంగా ఈ డ్రోన్ ఉంటుందని ఆమె ప్రత్యేకంగా తెలిపారు. అనంతరం కూటమి ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని రైతు అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పెడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు