ఏలూరు జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ల పరిధిలోని గ్రామాల్లో ఆదివారం సాయంత్రం 5గంటలకు ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో శక్తి టీం సభ్యులు స్థానిక బాలికల హాస్టళ్లలో, బహిరంగ ప్రదేశాలలో, మహిళాలపై అసాంఘిక కార్యకలాపాల జరగకుండా పెట్రోలింగ్ నిర్వహించారు. ఈమేరకు శక్తి యాప్ పై అవగాహన కల్పించారు. శక్తి యాప్ మహిళా భద్రతకు ఉపయోగపడుతుందని ప్రతిఒక్క మహిళా శక్తియాప్ అప్లికేషన్ ఫోన్ లో వేసుకోవాలని సూచించారు.