పాలకొల్లులో జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగాయి. మంత్రి రామానాయుడు టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం అందరికీ ఆదర్శనీయం అని కొనియాడారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆయనది కీలక పాత్ర అని, ప్రకాశం బ్యారేజీ నిర్మాణం వల్ల 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని వివరించారు.