సదాశివపేట పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కాలనీ నుంచి ఊబ చెరువు వరకు మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మరోవైపు భక్తులు భజనలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ఊబ చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సంగమేశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, చక్రవర్తి, అనిల్, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు