Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 31, 2025
మారేడుమిల్లి మండలం సున్నంపాడు సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు మృతి చెందారు దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. టూరిస్ట్ ప్రాంతాలు చూసి బైక్పై ఇద్దరు స్నేహితులతో కలసి తిరిగి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనం ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని మారేడుమిల్లి సీఐ ప్రసాద్ తెలిపారు. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా బొబ్బర్లంక గ్రామానికి చెందిన ఎం.ఫనీంద్ర (37) మృతి చెందాడని సీఐ ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.