కడప జిల్లా కమలాపురం పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడితే జరిమానాలు తప్పవని సోమవారం కమలాపురం నగర పంచాయతి కమీషనర్ ప్రహ్లాద్ హెచ్చరించారు.నగర పంచాయతీ కార్యాలయములో ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్ కవర్లను పూర్తిస్థాయిలో నిపీదిస్తున్నట్లు తెలిపారు సిబ్బందితో ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడే వ్యాపార సంస్థలపై దాడులు చేస్తామన్నారు. గతంలో కూడా ప్లాస్టిక్ కవర్లు నిషేదం పై తీర్మానాలు చేయడం జరిగిందని, అందుకోసం పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.