మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట లో డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రం ద్వారా సోమవారం రైతులకు యూరియా సరఫరా చేసినట్లు మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉంచామని ఆందోళన చెందవద్దని సూచించారు. రానున్న రెండు రోజుల్లో పిఎసిఎస్ సొసైటీకి యూరియా వస్తుందని తెలిపారు. మండల పరిధిలో 12వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు వివరించారు.