వీణవంక:తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల ఐదవ మహాసభను స్థానిక ప్రభుత్వ స్కూల్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ హాజరై మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం విడాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పంచాయతీ కార్మికుల కు ఉద్యోగ భద్రత కనిస వేతన అమలు చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయం కల్పించాలన్నారు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వమే నేరుగా పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలని అన్నారు.