గుంటూరు నగరంలో అంతర్గత డ్రైన్ల శుభ్రంపై ప్రజారోగ్య అధికారులు, కార్మికులు దృష్టి సారించాలని, వ్యర్ధాలు డ్రైన్లలో వేసే వారిపై భారీ అపరాధ రుసుం విధించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని కెవిపి కాలనీ, ఏటుకూరు రోడ్, పొన్నూరు రోడ్, సంగడిగుంట పలు ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను తనిఖీ చేసి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డివిజన్ల వారీగా ప్రజారోగ్య కార్మికులు ప్రతి రోజు తమకు కేటాయించిన ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో తప్పనిసరిగా డ్రైన్లను శుభ్రం చేయాలన్నారు.