ములుగు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో జిల్లాలోని స్థానిక సమస్యల పరిష్కారం కొరకు నేడు బుధవారం రోజున మధ్యాహ్న 2 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యుడు అజ్మీరా సీతారాం నాయక్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు అమలు కాని హామీలతో గద్దెపైకి వచ్చిన ప్రభుత్వమే రేవంత్ రెడ్డి సర్కార్ అని ధ్వజమెత్తారు. ఎన్నడూ లేని విధంగా తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఇదేనని విమర్శించారు