నల్లగొండ జిల్లా: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ ముస్తఫా అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నల్లగొండలోని రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డు ద్వారా తమ దయనీయమైన స్థితిగతులను తెలియజేశారు. ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనలో తెలంగాణ ఉద్యమకారులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.