గణేశుడికి పూజలు నిర్వహించిన జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి స్థానిక ఇల్లందు కోర్ట్ ఏరియాలో నందు గల శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన గణపతిని జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జడ్జి కి పూలమాలవేసి శాలువాతో సత్కరించినారు. కమిటీ వారు నిర్వహించిన మహా ప్రసాదం కార్యక్రమాన్ని జడ్జి చేతుల మీదుగా ప్రారంభించి స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు వడ్డించినారు.