పెన్షన్లలో కోత విధించాలని దివ్యాంగుల వైకల్య శాతాన్ని తగ్గించి సర్టిఫికెట్లు ఇవ్వాలని వైద్యులను కూటమి ప్రభుత్వం బెదిరిస్తుందని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా నరసరావుపేట కలెక్టరేట్ వద్ద సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగులతో కలిసి పెన్షన్లు తొలగింపు అన్యాయమని పేర్కొంటూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల పెన్షన్లు ప్రభుత్వం తొలగించిందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.