ఏలూరు నియోజకవర్గం పరిధిలో శెట్టిబలిజ కులస్తులకు ప్రభుత్వం కేటాయించిన బార్ ను తమ కులానికి చెందిన వారికే ఇవ్వాలని శెట్టిబలిజ కులస్తులు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఏలూరు ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ కులాని కి కేటాయించిన షాపును బైరెడ్డి విజయ్ కుమార్ అనే వ్యక్తి కి వెళ్ళిందని అయితే శెట్టిబలిజ కులానికి సంబంధించిన వ్యక్తి కాదని ఫేక్ సర్టిఫికెట్ పెట్టి ప్రభుత్వాన్ని మోసం చేశాడని మండిపడ్డారు.