ఉప్పలగుప్తం మండలంలోని భీమనపల్లి, గొల్లవిల్లి గ్రామాలలో భారీ వర్షాల సమయంలో ముంపును తట్టుకుని నిలబడే వరి వంగడాల సాగును మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు శుక్రవారం పరిశీలించారు. ఈ మేరకు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నందకిషోర్ ఆధ్వర్యంలో పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు గిరిజారాణి, సహదేవ రెడ్డి రైతులతో కలిసి శుక్రవారం పంటలు పరిశీలించారు. పంట సాగుపై చర్చించారు.