ప్రకాశం జిల్లా దొనకొండ వాసులకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శుభవార్త చెప్పారు. ఇకపై దొనకొండ రైల్వే స్టేషన్ లో మూడు ప్రధాన రైళ్లు ఆగుతాయన్నారు. గత నెలలో రైల్వే జీఎంకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని దొనకొండ కురిచేడులలో పలు రైళ్లు నిలుపుదల చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ మేరకు రైల్వే అధికారులు దొనకొండలో అమరావతి ఎక్స్ ప్రెస్ యశ్వంతపూర్ వాస్కోడిగామా ప్రశాంతి ఎక్స్ ప్రెస్ నిలుపుదల చేస్తున్నట్లు సంబంధిత షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపారు.