విశాఖలో శుక్రవారం ఉదయం శంకరమఠం సమీపంలోని ఆర్టీసీ బస్సు నడిరోడ్డుపై దగ్ధమవడంతో.. విశాఖలోనే ఉన్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. బస్సుల ఫిట్నెస్ పై దృష్టి సారించాలని సూచించారు. రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు ,ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.