సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలం బుదేర మహిళా డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు.మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ రూపాయలు రెండున్నర కోట్లతో గదులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తదితరులు అధికారులు పాల్గొన్నారు.