జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జిల్లా వ్యవసాయాధికారులను హెచ్చరించారు. రసాయనిక ఎరువుల కృత్రిమ కొరత సృష్టించే డీలర్లు, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎరువులు బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్లకుండా పకడ్బందీ చూడమని ఆదేశించారు.రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు సిద్ధంగా ఉంచి, రైతుల అవసరాలను సమయానికి తీర్చేలా వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి మండలంలో బృందాలు ఏర్పాటు చేసి, ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని, యూరియా, ఇతర ఎరువుల కొరత రాకుండా విజిలెన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.