యూరియా బ్లాక్ మార్కెట్ ను నివారించాలని, రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని కోరుతూ వైసిపి ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోటా రామకృష్ణ అగ్రిమెంట్ ఇచ్చారు. ఆదివారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, నియోజకవర్గ ఇన్చార్జ్ తలారి వెంకట్రావు నాయకత్వంలో వైసిపి కార్యకర్తలు భారీగా పాల్గొని రైతులు సమస్యలు తీరేవరకు పోరాడాలని కోరారు.