విజయనగరం జిల్లా గోపాలరాయుడుపేట పంచాయితీకి చెందిన దుబ్బాక పార్వతి బొబ్బిలి MPDO ఆఫీసు గేటు పక్కన శుక్రవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది బొబ్బిలి CHCలో చేర్పించారు. స్వగ్రామం నుంచి తన పెద్ద కుమార్తెతో ఆటోలో వచ్చిన పార్వతి బొబ్బిలి కాంప్లెక్స్ వద్ద దిగి ఆసుపత్రికి నడిచి వెళ్తుండగా మార్గ మద్యంలోనే ప్రసవించింది. వైద్య సిబ్బందికి పార్వతి సమాచారం ఇవ్వలేదని ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.