ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఇద్దరికి గాలైనా సంఘటన గురువారం సాయంకాలం నాలుగున్నర గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది స్థానికుల కథనం మేరకు పూతలపట్టు మండలంలోని బండపల్లి సమీపంలో తిరుపతి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదే వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని అదుపుతప్పి ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్రగాయాలు అయిందని తెలిపారు. ఈ ఘటనపై పూతలపట్టు పోలీసులకు సమాచారం అందించడంతో నటన స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరు వ్యక్తులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.