మహిళలకు ఏదైన సమస్య ఎదురైనప్పుడు పోలీసులకు కాల్. చేయడానికి వెనకాడకండని డయల్ 100 కు కాల్ చేస్తే నిముషాల వ్యవధిలోనే సహయం అందుతుందని రిటైర్డ్ ఆదాయపు పన్ను కమిషనర్ వడ్డాది అప్పలరాజు అన్నారు. మంగళవారం మద్దిలపాలెం సమీపంలో కళాశాల ఆవరణలో సింహాద్రి టి.ఎమ్.టి.,విశాఖ సిటీ మహిళా పోలీస్ స్టేషన్ సంయుక్త సారధ్యంలో ఉదయం 9.30 గంటలకు మహిళల భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ఆదాయపు పన్ను కమిషనర్ వడ్డాది అప్పలరాజు మాట్లాడారు.