సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మద్దిరాల మండల కేంద్రంలోని డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పేద ప్రజలు ఆదివారం ఆందోళన చేపట్టారు. దాదాపు 100 కుటుంబాలకు చెందిన ప్రజలు ఇండ్ల తాళాలు పగలగొట్టి మూకుమ్మడిగా ఇండ్లలోకి ప్రవేశించారు. విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేకున్నా వారు ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి హామీ ఇచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించగా కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.