బంగారుపాళ్యం మండలం వజ్రాలపురం బోయకొండ ఆలయం వద్ద సోమవారం మద్యం షాపులో రిజెర్వేషన్ కల్పించినందుకు జిల్లా ఈడిగ సంఘం సాధికార అధ్యక్షుడు నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మద్యం షాపులు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు.