మన్యం జిల్లా, కురుపాం లో వైసిపి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించి ధ్వంసం చేశారు. నూతన సంవత్సర వేడుకలు, జగ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా కురుపాంలో వైసీపీ శ్రేణులు పలుచోట్ల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఆ బ్యానర్లు చించేశారు. విషయాన్ని తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గురువారం ఖండించారు. గత 5 ఏళ్లలో తాము రాజకీయాలు హుందాగా నిర్వహించామని ఇలాంటి దిగజారుడు రాజకీయం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు.