ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ నీటిపారుదల శాఖకు సంబంధించిన బీటీ మట్టి రోడ్లను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మూడు గంటల సమయంలో పరిశీలించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుండి ఆర్డీవో కార్యాలయం పాత బస్టాండ్ మీదుగా పళ్ళ బ్రిడ్జ్ ఎంబి చర్చ్ ఆర్ అండ్ బి రోడ్డు ను చూశారు. అటు నుంచి ఏ క్లాస్ పూర్ మార్గంలోని లోక పల్లి లక్ష్మమ్మ గుడికి వెళ్లే మట్టి రోడ్డు ను పరిశీలించారు. ఇటీవలే లోక పల్లి లక్ష్మమ్మ జాతరకు ముందు ఆ రహ దారిని మట్టి వేసి చదును చేశామని ఇటీవలే కురిసిన వర్షాలకు మట్టి రోడ్డు రహదారి దెబ్బ తిన్నదని అన్నారు.