దేశంలో ఎక్కడాలేని విభిన్నమైన రూపంలో ఉన్న దశభుజ మహాగణపతి రాయదుర్గంలో కొలువై ఉన్నాడు. 14వ శతాబ్దం భూపతిరాయలు కాలంలో ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. 15 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో భారీకాయం గల ఏకశిల విగ్రహం ఇది. తల్లి పార్వతిదేవి వలె 10 చేతులు కలిగి భార్య సిద్దిసమేతంగా ఉండటం విశేషం. నారికేలం సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకోవడం వల్ల కోరినకోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం.