మానవ జీవన మనుగడకు దిక్సూచి వంటిది పూర్వ పీఠాధిపతి హుస్సేన్ షా రచించిన షాతత్వ గ్రంధమని,పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పీఠం సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా 120 వ జయంతిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాడ ఫ్లేవర్ బ్రిడ్జి సమీపంలో నూతన ఆశ్రమ ప్రాంగణంలో మంగళ వారం ఉదయం 10 గంటల నుండి ఏర్పాటు చేసిన సభలో ఆలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేసారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు భక్తులు ను ఉద్దేశించి పీఠాధిపతి ఉమరాలిష్య మీడియా వివరాలు తెలిపారు.