కూటమి ప్రాంతం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతుందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని శుక్రవారం కలిసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుల పై కేసులు మరియు అరెస్టులు తప్ప ప్రజల కోసం ఏమి ఆలోచించడం లేదన్నారు. ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయాలన్న ఆలోచన వారికి ఉందన్నారు సీతారాం.