గాజాలో నరమేధం సృష్టిస్తున్న ఇజ్రాయిల్ తో ఎలాంటి వ్యాపార సంబంధాలు ద్వైపాక్షిక పెట్టుబడులు నిర్వహించొద్దని భారత్లో పర్యటిస్తున్న ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి వెంటనే వెనుతిరిగి వెళ్ళాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా తోరూర్ పట్టణ కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇజ్రాయిల్ దేశ ప్రదాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు, ఇజ్రాయిల్ ప్రధాని తో పాటు మంత్రులపై విచారణ చేపట్టాలని వెంటనే గాజాలో శాశ్వత కాల్పుల విరమణ చేపట్టాలని డిమాండ్ చేశారు.