తిర్యాణి మండలం పంగడి మదర ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న అనురాగ్ అనే విద్యార్థి సోమవారం రాత్రి MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు DTDO రమాదేవి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ....ఈ నెల 15న జ్వరం వస్తుందనీ వారి తల్లిదండ్రులు తిర్యాణి ఆసుపత్రికి తరలించారు. తిర్యాణి ఆసుపత్రిలో రెండు రోజులు చికిత్స అందించిన నయం కాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ రక్త పరీక్షలు చేశారు. అనురాగ్ కు డెంగ్యూ నిర్ధారణ కావడంతో వెంటనే వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు DTDO రమాదేవి తెలిపారు