ఈ సంవత్సరం విజ్ఞేశ్వర మహారాజ్ దయతో రైతులకు పంటలు బాగా పండాలని ఆర్థిక ఇబ్బందులు లేకుండా అందరూ బాగుండాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలు సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.