రజకులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కర్నూల్లో రజకులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 12 గంటలకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట రజకులు చేరుకొని వినూత్న రీతిలో గాడిదలతో నిరసన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ రజకులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఉచిత కరెంట్ అందిస్తామని చెప్పి ఇప్పటికి అమలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.