శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ఇల్లు లేని నిరు పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం కదిరి తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సైదాపురంలోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు అందివ్వాలని వారు డిమాండ్ చేశారు. పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేంతవరకు పోరాడుతామని తెలియజేశారు.