విశాఖపట్నంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాలు ఆలయ పునరుద్ధరణ, సంప్రదాయాలను పరిరక్షించే లక్ష్యంతో ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.మొదటి రోజు పవిత్రోత్సవాలు బుధవారం రోజున గణపతి పూజతో ప్రారంభమయ్యాయి. అనంతరం యాగశాల ప్రవేశం, బలిహరణం, పవిత్ర ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.రెండో రోజు గురువారం రోజున యాగశాలలో ప్రత్యేక హోమాలు, జపాలు జరిగాయి.