ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఐన ప్రజా దర్బార్ లో రాష్ట్ర మంత్రి పాల్గొన్నారు. పట్టణంలో పలు రకాల సమస్యలతో వచ్చిన వారి నుండి అర్జీలను స్వీకరించి, ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.