స్థానిక ఈవిఎం గోదాములను శుక్రవారం 12pm జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తనిఖీ చేశారు. గోదాములకు, గదులకు వేసిన సీళ్లను పరిశీలించారు. సిసి కెమేరాలను పర్యవేక్షించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో డిఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఎన్నికల విభాగం సూపరింటిండెంట్ భాస్కర్రావు, నెల్లిమర్ల తాశిల్దార్ శ్రీకాంత్, డీటీ జగన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.